logoమహేష్ భట్ ఫ్యామిలీ వేడుకలో సందడి చేసిన సెలబ్స్ ..!

...

బాలీవుడ్ లో వివాహ వేడుకలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సారి భట్ ఫ్యామిలీలో పెళ్ళికి సంబంధించిన హంగామా జరిగింది. ఫిలిం మేకర్ ముకేష్, నీలిమల కూతురు సాక్షి భట్ తన బాయ్ ఫ్రెండ్ మజహీర్ ని రిసెంట్ గా వివాహం చేసుకోగా, శుక్రవారం భట్ ఫ్యామిలీ ముంబైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెస్షన్ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ తారాగణం అంతా తరలి వచ్చింది. అక్షయ్ కుమార్ , అమీర్ ఖాన్ , అనిల్ కపూర్, బిపాసా బసు ఆమె భర్త కరణ్, విక్కీ కౌశల్, విద్యాబాలన్,అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, షారూఖ్ ఖాన్, రణవీర్ సింగ్ తదితరులు రిసెస్షన్ లో సందడి చేశారు. తన కజిన్ పెళ్ళిలో అలియా భట్ వైట్ లెహంగా చోళిలో మెరిసింది. ఆట పాటలతో పలువురు స్టార్స్ రిసెస్షన్ ని సందడి గా మార్చారు. సాక్షి భట్ .. మహేష్ భట్ మేనకోడలు అనే విషయం తెలిసిందే.