logo



ఆసుపత్రిలో వెంకటేశ్ ..!

...

ఎఫ్ 2 మల్టీ చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేశ్ మంచి విజయాన్ని సాధించారు. అయితే కొద్ది రోజులుగా ఆయన తీవ్ర వెన్నునొప్పి కారణంతో బాధపడుతున్నారు. కాగా వెంకటేశ్ విశాఖపట్నంలోని నేచురల్ క్యూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం, కొద్ది రోజుల పాటు చికిత్స తీసుకొనున్న ఆయన వైద్యం పూర్తి అయిన తర్వాత తిరిగి హైదరబాద్ కి రానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. వెంకటేశ్ తోపాటు కొందరు కుటుంబసభ్యులు ఆయనతో ఉన్నట్టు తెలుస్తుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వెంకి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట.