logoనేడు కడపలో సీఎం పర్యటన ..!

...

కడపలో సీఎం చంద్రబాబు పర్తటించనున్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాల డ్వాక్రా మహిళలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. మహిళలకు పలు కీలక పథకాలను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. 5 జిల్లాల నుండి 40 వేల మంది మహిళలు తరలిరనున్నారు. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో నిలబడే పలు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నింటిని పూర్తి చేశారు. భారీ పోలీసు బలగాలతో పటిష్టమైన బందోబస్తును జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి ఏర్పాటు చేశారు.