logo



'ఇన్వెస్ట్ తెలంగాణ' లో జాబ్ ఎలా ఉంది సర్ ..?

...

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొత్త ఉద్యోగంలో చేరిందట. తన ఉద్యోగం ఎలా ఉందని టీఆర్ ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంటు కేటీఆర్ ను ట్విట్టర్ ద్వారా అడుగుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో భాగంగా ఉపాసన ఇటీవల దావోస్ కు వెళ్లారు. ;;ఇన్వెస్ట్ తెలంగాణ' కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు సమాచారం అందించి వారిని పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించడం కోసం తెలంగాణ డెస్క్ కు కో ఆర్డినేటర్ గా వ్యవహరించారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.