logo



బన్నీ ఎమోషనల్ లవ్ స్టోరీ ..!

...

డీజే, నా పేరు సూర్య ప్లాపూలతో షాక్ తిన్న అల్లు అర్జున్ . చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన అధికారి ప్రకటన వెలువడింది. ప్రస్తుతం చిత్రా నటి నటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. ఇక ఈ చిత్ర కథ అంత ఎమోషనల్ లవ్ స్టోరీ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈసారి బన్నీ యాక్షన్ జోలికి వెళ్లకుండా ప్రేమకథతో వస్తున్నాడట. ఈ చిత్రాన్ని మార్చి లో సెట్స్ పైకి తీసుకోచ్చేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో గతంలో 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరోసారి వీరి కాంబోలో సినిమా వస్తుండడం తో అందరిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియెషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.