logoపార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీలు ..!

...

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాలలో అక్కడి పార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీలు ఉంటాయన్నారు. బెంగాల్ లో తృణమూల్ తో కాంగ్రెస్ పొత్తు లేదని కాంగ్రెస్ నేతలు కోల్ కతా ర్యాలీకి వచ్చారని తెలిపారు. దేశంలో వ్యవస్థలను కాపాడుకోవడమే ఉమ్మడి అజెండా అని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడమే బీజేపీయేతర 23 పార్టీల అజెండా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.