logoఆస్తులు తాకట్టు పెట్టి విద్యా సంస్థలను నడుపుతున్నా ..!

...

తమకున్న ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకొని శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను నడిపిస్తున్నట్లు సినీ నటుడు మోహన్ బాబు పేర్కొన్నారు. ఈరోజు మోహన్ బాబు విలేకరులతో మాట్లాడుతూ ఒక నెల సంస్థ నిర్వహణకు రూ. 6 కోట్లు అవసరమని, గత రెండేళ్లుగా ఎపి ప్రభుత్వం నుండి రూ. 20 కోట్ల ఫీజు రియింబర్స్ మెంట్ నిధులు రావాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వ బకాయిలు పెండింగ్ లో ఉన్నా నమ్ముకున్న సిద్ధాంతాలకు లోబడి విద్యార్ధుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు.