logo



ఇస్మార్ట్ శంకర్ లో కథానాయికగా అను ఎమ్మాన్యుయెల్ ..!

...

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ లలో ఒకరిగా ఉన్న పూరీ జగన్నాథ్ ఈ మధ్య వరుస ఫ్లాపులతో ఇబ్బందిపడుతున్నాడు. ప్రస్తుతం రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాతో ఎలా అయిన మంచి విజయం సాధించాలని కసరత్తులు చేస్తున్నాడు పూరీ. ఆ మధ్య చిత్రా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని రివిల్ చేసి మూవీపై భారీ అంచనాలే పెంచాడు. ఇక చిత్రంలో కథానాయికగా అను ఎమ్మాన్యుయెల్ ని తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఈమెతో పాటు మరో హీరోయిన్ కి కూడా ఇందులో నటించే అవకాశం ఉండగా, పూరీ ఎవరిని ఎంపిక చేస్తారా అనే సందేహం అందరిలో నెలకొంది. నేటి నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందని అంటున్నారు. మే లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావలనేది టీం ప్లాన్ అట. ఈ చిత్రానికి చార్మి సహనిర్మాతగా వ్యవరిస్తున్న విషయం విదితమే.