logo



నీ గురించి ఆలోచించనప్పుడల్లా నాగార్జున ..!

...

లెజెండారీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు 5వ వర్థంతి ఈరోజు. తన తుదిశ్వాస విడిచే వరకూ నటించాలనే కోరికను నిజం చేసుకున్న ప్రముఖ నటుడు ఏఎన్నార్. 'మనం' చిత్రం ద్వారా చివరిసారిగా వెండితెరపై కనిపించారు. తన కుమారుడు, మనవళ్లతో కలిసి ఈ చిత్రంలో ఏఎన్నార్ నటించడం విశేషం. తన తండ్రి వర్థంతి సందర్భంగా అక్కినేని నాగార్జున ట్విటర్ ద్వారా స్పందించారు. 'నీవు మమ్మల్ని వదిలి ఐదేళ్లవుతోంది. నీ గురించి మేము ఆలోచించినప్పుడల్లా నీతో గడిపిన ఆనంద క్షణలే గుర్తొస్తాయి. నీ అభిమానులు, కుటుంబం అంతా లవ్ యు, వియ్ మిస్ యు నాన్న' అని ట్వీట్ లో పేర్కొన్నారు.