logo



ఈ చిన్నారికి మీ విషేస్, దీవెనలు అందించండి ..!

...

ఓ చిన్న గ్రూప్ డ్యాన్సర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రముఖ కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, హీరోగా రాణిస్తున్న సెలబ్రిటీ రాఘవ లారెన్స్ . ఎందరో చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి ప్రాణదాతగా మారారు. అంతే కాకుండా కష్టం అనే మాట వినిపించిన ప్రతిచోటికి వెళ్లి తనవంతు సాయం చేస్తూ అభిమానుల గుండెల్లో రియల్ హీరోగా మారిపోయారు. తాజాగా ఆయన ఓ చిన్నారికి పరిచయం చేస్తూ అతని పుట్టినరోజు సందర్భంగా దీవెనలు, విషేస్ అందించమని అభిమానులను కోరారు. 'హాయ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ ! ఈ చిన్నారి పేరు ఈశ్వర్. అతను ఒక సంవత్సరం క్రితం నా దగ్గరికి వచ్చాడు. నేడు తన పుట్టినరోజుని నాతో జరుపుకుంటున్నాడు. ఈశ్వర్ కి మీ విషేస్,దీవెనలు అందించాలని కోరుతున్నాను' అని లారెన్స్ ట్వీట్ చేశారు.