logo



ఏఎన్ఆర్ బయోపిక్ పై నాగ్ స్పందన ..!

...

ప్రస్తుతం అంతటా బయోపిక్ ల హవా నడుస్తుంది. వివిధ రంగాలకి చెందిన ప్రముఖుల జీవిత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తుంది. ఇటీవల తెలుగులో సావిత్రి జీవిత నేపథ్యంలో వచ్చిన సూపర్ హిట్ కొట్టాయి. మరికొన్ని బయోపిక్స్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఏఎన్ఆర్ బయోపిక్ రూపోందించెందుకు నాగ్ ఆసక్తి చూపుతున్నారా లేదా అనే దానిపై ఎప్పటి నుండో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై పలుమార్లు నాగ్ ని ప్రశ్నించినప్పటికి ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. తాజాగా తిరుమల వెంకటేశ్వరస్వామిని హైదరబాద్ బాడ్మింటన్ అసోసియేషన్ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ తో కలిసి దర్శించకున్నారు నాగార్జున. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరారు. ఇక తన కొత్త సినిమా విషయాలని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే తన తండ్రి జీవిత నేపథ్యంలో సినిమా తీస్తారా అని విలేకరులు అడగగా, ఏ సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్లిపోయారు. దీంతో ఏఎన్ఆర్ బయోపిక్ పై మళ్ళీ సస్పెన్స్ నెలకొంది. నాగ్ చివరిగా దేవదాస్ అనే మల్టీస్టార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.