logoబాలయ్య నటన అత్యద్భుతం ..!

...

తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఈరోజు విడుదలైన అన్నీ చోట్ల విశేష స్పందన లభిస్తుంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటన అద్భుతం అని కొనియాడుతున్నారు. తాజాగా సీనియర్ దర్శకుడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్ర యూనిట్ మొత్తానికి పేరు పేరునా అభినందనలు తెలియజేశారు. విశ్వవిఖ్యాత నటసార్వబౌమ శ్రీ నందమూరి తారకరామారావు పాత్రను అద్భుతంగా పోషించిన బాలయ్యకు హ్యాట్సాఫ్ అంటూ రాఘవేంద్రరావు పోస్ట్ పెట్టారు.