logo



కాంచన 3 షూటింగ్ పూర్తి సమ్మర్ లో విడుదల ..!

...

ప్రముఖ కొరియో గ్రాఫర్ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ముని చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపు చిత్రాలన్నింటిని కూడా లారెన్స్ తెరకెక్కించగా, ఇవి మంచి సక్సెస్ నే సాధించాయి. అంతేకాక భారీగానే వసూళ్ళను రాబట్టాయి. ఇప్పుడు ముని సిరీస్ లో నాలుగో చిత్రం రూపొందుతుంది. తాజాగా చిత్ర షూటింగ్ పూరైంది. చిత్ర ప్రధాన పాత్ర ధారులు లారెన్స్ , నిక్కీ తంబోలి, వేదిక ఒకరికొకరు కేక్ కట్ చేసుకొని తినిపించుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కబీర్ దుహన్ ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సమ్మర్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ భావిస్తుంది. ముని సిరీస్ లో నాలుగో చిత్రంగా వస్తున్న కాంచన చిత్రానికి లారెన్స్ దర్శకుడిగాను, నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.