logo



నెదర్లాండ్స్ లో చైసామ్ న్యూ ఇయర్, హాలిడ్ ట్రిప్ ఫోటోలు

...

నాగచైతన్య , సమంత తమ న్యూ ఇయర్ వేడుకలను ఎక్కడ జరుపుకున్నారో తెలుసా? న్యూ ఇయర్, హాలిడ్ ట్రిప్ కోసం చైసాయ్ జంట నెదర్లాండ్స్ చెక్కేసింది. చైసామ్ తో పాటు వాళ్ల ఫ్రెండ్స్ కూడా వెళ్లారట. అక్కడ వాళ్లు సూపర్బ్ గా ఎంజాయ్ చేశారట. వాళ్లు ఎంజాయ్ చేసిన ఫోటోలను సమంత తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చైసామ్ పెళ్లి అక్టోబర్ 2017 లో గోవాలో జరిగింది. ముందు హిందూ సంప్రదాయం తర్వాత క్రిస్టియన్ సాంప్రదాయంలో వాళ్లు పెళ్లి జరుపుకున్నారు. పెళ్లి తర్వాత చైసామ్ కలిసి నటిస్తున్న సినిమా మజిలీ. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ గత సంవత్సరం డిసెంబర్ లో రిలిజయింది. ఈ జంట వాళ్ల పెళ్లికి ముందు ఏమాయ చేసావే, ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో కలిసి నటించారు. ఇక నాగచైతన్య చివరగా సవ్యసాచి సినిమాలో నటించాడు.