logo



నేడు నిమ్మకూరుకు బాలయ్య, విద్యాబాలన్..!

...

మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరుకు ఇవాళ ఆయన కుమారుడు, సినీనటుడు బాలకృష్ణ రానున్నారు. ఆయనతోపాటు ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర పోషించిన హీరోయిన్ విద్యబాలన్ కూడా వస్తున్నారు. బయోపిక్ కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను నిమ్మకూరులో చిత్రీకరిస్తారు. అలాగే నిమ్మకూరులోని ఎన్టీఆర్ దంపతులు విగ్రహాలకు పూలమాల వేసి వీరు నివాళులర్పిస్తారు.