logoఎమ్మెల్సీకి బాలకృష్ణ ఫోన్ ఎన్టీఆర్ బయోపిక్ మూవిపై చర్చ..!

...

ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కు సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఫోన్ కాల్ చేశారు. నిన్న మెట్టుపల్లి జన్మభూమిలో కేఈ ప్రభాకర్ పాల్గొని ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో సినీ నటుడు బాలకృష్ణ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే కేఈ ప్రభాకర్ కొద్దిసేపు బయటకు వెళ్లి మాట్లాడారు. అనంతరం కేఈ మాట్లాడుతూ 9వ తేదీన ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అవుతున్నట్లు తెలిపారు. ఈ సినిమా ప్రదర్శన కోసం తగు చర్యలు తీసుకోవాలని, అభిమాన సంఘాలతో మాట్లాడాలని బాలకృష్ణ చర్చినట్లు కేఈ ప్రభాకర్ తెలిపారు.