logo



కార్తికేయ రిసెస్షన్ ఎక్కడో తెలుసా..?

...

దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం డిసెంబర్ 30న జైపూర్ లో అంగరంగ వైభవంగా జరిగినా సంగతి తెలిసిందే. ఇక వివాహ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు సైతం హాజరయ్యారు. ఇక రిసెస్షన్ జనవరి 6న హైదరబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరగనుంది. ఈ వేడుక కోసం రాజమౌళి ఓ ప్రత్యేక సెట్ వేయించారు. ఈ వేడుకకి తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఆహ్వానించనున్నాడట. ఇప్పటికే రిసెస్షన్ వేడుకకి సంబంధించిన అన్నీ ఏర్పాట్లు పురైనట్టు తెలుస్తుంది. ఈ పెళ్లి వేడుక పనులు మొత్తం పూర్తి కాగానే తాను దర్శకత్వం వహిస్తున్న మల్టీస్టారర్ మూవీ తో బిజీ కానున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి కాగా, రెండో షెడ్యూల్ ను ఫిబ్రవరి లో మొదలుపెట్టనున్నారు.