logo



సంక్రాంతికి జయలలిత వెబ్ సిరీస్ ట్రైలర్..!

...

విప్లవ నాయిక జయలలిత జీవితం ఆధారంగా పలువురు దర్శకులు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఏపిల్ విజయ్, ప్రియదర్షాణి, భారతీరాజా తదితరులు ఈ విషయంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో జయలలిత బయోగ్రఫీని వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్నారు గౌతంమేనన్. ఇందులో జయలలిత రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఆదేరోజున ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎంజి ఆర్ , శోభన్ బాబులతో పాటు పలు పాత్రలు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అందరికన్నా వెనుక ప్రారంభించిన గౌతం మేనన్ అందరికన్నా ముందుగానే ఫస్ట్ లుక్, ట్రైలర్ ను తీసుకొస్తుండటం విశేషం.