logo



భారతదేశానికి "ఇండియా "అనే పేరు మార్చామంటూ సుప్రీంలో పిటిషన్

...

భారతదేశానికి ఇండియా అనే పేరు కాకుండా భారత్‌ లేదా హిందుస్తాన్‌ గా మార్చాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ ను సర్వోన్నత న్యాయస్థానం జూన్ 2 న(రేపు) విచారణ జరపనుంది. అలా పేరు మార్చడం వల్ల దేశ ప్రజల్లో ఆత్మ గౌరవం, జాతీయత భావం పెరుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. 1948 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయంలోనే ఇండియా అనే పేరు స్థానంలో భారత్ లేదా హిందుస్తాన్ అనే పేరు పెట్టాలని బలంగా వాదన వినిపించిన అంశాన్ని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఇండియా అనే పేరును మార్చి భారత్‌ లేదా హిందుస్తాన్‌ గా పిలిచేలా రాజ్యాంగం లోని ఆర్టికల్ 1లో సవరణలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. ఆర్టికల్ 1 లోనే దేశం పేరు, సరిహద్దులు కూడా నిర్దేశించి ఉంటాయి. భారత్ అనే పేరును హిందుస్తాన్‌ గా మార్చడం వల్ల దేశ ప్రజలు గతంలో తాము మరొకరి పాలనలో ఉన్నామనే భావన నుంచి బయట పడతారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ శుక్రవారమే (మే 29) సుప్రీంకోర్టులో విచారణకు లిస్ట్ అయింది... అయితే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్.ఏ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత లిస్ట్ నుంచి డిలీట్ చేశారు. సుప్రీంకోర్టులో అందుబాటులో ఉన్న నోటీసు ప్రకారం ఈ పిటిషన్ జూన్ 2వ తేదీన కోర్టు ముందుకు విచారణకు రానుంది.