కరోనా వేళ పాకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కరాచి విమానాశ్రయం వద్ద పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలినట్లు అధికారులు వెల్లడించారు. లాహోర్ నుంచి కరాచీకి వచ్చిన విమానం.. ల్యాండింగ్‌కు ఒక నిమిషం ముందే కూలిపోయింది. కూలిపోయిన ఎయిర్‌లైన్స్‌ను పీఐఏ ఎయిర్‌బస్ ఏ320గా అధికారులు నిర్ధారించారు. జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలోని మోడల్ కాలనీలోని ఇండ్లపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 90 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు కూడా పోలీసులకు సహాయం చేస్తున్నారు.