logo



బీసీల రిజర్వేషన్ల పై జగన్ కి చంద్రబాబు లేఖ

...

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. బీసీలకు అమలవుతున్న 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించాలని లేఖలో కోరారు. సుప్రీం కోర్టులో వెంటనే స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయాలన్నారు. ప్రభుత్వ తాజా చర్యతో బీసీలకు రిజర్వేషన్‌ ఫలాలు దూరమవుతున్నాయని పేర్కొన్నారు. బీసీలకు 24 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలనుకోవడం సరికాదన్నారు. ఇంత తీవ్రమైన సమస్యపై అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. బీసీ సంఘాలను సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు.