logo



చంద్రబాబు కాన్వాయ్ పై కోడి గుడ్లు ,టమోటా లతో దాడి చేసిన వైసిపీ కార్యకర్తలు

...

తెలుగుదేశం అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫై కోడి గుడ్లు, టమాటాలు తో వైసీపీ కార్య కర్తలు దాడి చేసారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు కాన్వాయ్‌ ను వైసీపీ కార్యకర్తలు అడ్డుతగిలారు. ఆయన వెళ్లే మార్గంలో రోడ్డు మీద పడుకొని కాన్వాయ్‌ను ముందుకు కదలనీయలేదు. చంద్రబాబు నాయుడు గో బ్యాక్ అంటూ అధికార పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరికొంతమంది బాబు కాన్వాయ్ మీదకు చెప్పులు, కోడి గుడ్లు, టమోటోలు విసిరారు.దీంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదల్లేదు. ఈ ఘటన పట్ల అనిత స్పందిస్తూ.. చంద్రబాబు నాయుణ్ని జగన్ ఎదుర్కోలేక ఇలా చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. జనాలకు డబ్బులిచ్చి వైసీపీ నేతలు తీసుకొచ్చారని టీడీపీ నాయకులు ఆరోపించారు. బాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడం పట్ల టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.