logo



సిఎం జగన్ చేతికి బోస్టన్ నివేదక

...

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్ (బిసిజి) ప్రభుత్వానికి శుక్రవారం నివేదిక సమర్పించింది. సీఎం క్యాంపు ఆఫీస్‌లో బిసిజి సభ్యులు ముఖ్యమంత్రి ని కలిసి ఎపిలో సమతుల్య, సమగ్రాభివృద్ధిపై నివేదిక సమర్పించారు. ఇప్పటికే రాజధాని అంశంపై జీఎన్‌ రావు కమిటీ రిపోర్టుపై మంత్రివర్గం చర్చ జరిపిన సంగతి తెలిసిందే. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ జీఎన్‌ రావు, బిసిజి నివేదికలపై చర్చించి, అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది. హైపవర్‌ కమిటీ భేటీ అనంతరం రాజధాని అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ నెల 6న హైపవర్‌ కమిటీ భేటీ అయి చర్చించనుంది. 20 లోపు ప్రభుత్వానికి రిపోర్టు అందించనుంది. హైపవర్ కమిటీలో మంత్రులు, న్యాయ నిపుణులు ఉంటారు.