logo



కర్నాటకలో పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తాం : సీఎం యడియూరప్ప

...

పౌరసత్వ సవరణ చట్టాన్ని కర్నాటకలో అమలు చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తెలిపారు. ఈ చట్టాన్ని తాము అమలు చేయబోమని పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ లతో పాటు మరికొన్ని రాష్ట్రాలు ప్రకటించిన నేపథ్యంలో యడియూరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో బుధవారం యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ఇందిరా క్యాంటీన్ల పేరును మార్చే యోచన తమకు లేదని తెలిపారు. ఈ క్యాంటీన్ల పేరును 'మహర్షి వాల్మీకి అన్న కుటీర'గా మారుస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ అంశంపై యడియూరప్ప క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, పౌరసత్వ చట్టంపై దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చట్టం అమలుపై స్టే విధించాలన్న పిటిషన్లను కూడా సుప్రీం కోర్టు కొట్టి వేసింది. చట్టాన్ని తాము పరిశీలిస్తామని చెప్పింది.