logo



ఉల్లి తిననన్న సీతారామన్ ...అవకాడో తింటారంటున్న చిదంబరం

...

ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఉల్లి గురించి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఉల్లిపాయలు ఎక్కువగా తిననని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బుధవారం చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉల్లిపాయ తినని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. ఆవిడ ఆవకాడో తింటారా విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బుధవారం పార్లమెంట్ లో దేశంలో ఉల్లి సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని, ఈజిప్ట్,ఇతర దేశాల నుంచి ఉల్లి దిగుమతుల నిర్ణయంపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్న సమయంలో ఓ ఎంపీ మీరు ఈజిప్ట్ ఉల్లిపాయలు తింటారా అని ఆమెను ప్రశ్నించారు. దీనికి సీతారామన్ సమాధానమిస్తూ....నేను ఉల్లిపాయ-వెల్లుల్లిని ఎక్కువగా తినను. ఉల్లిపాయతో పెద్దగా సంబంధం లేని కుటుంబం నుంచి నేను వచ్చాను అని అన్నారు. ఉల్లిపాయ తినని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు.ఆవిడ ఆవకాడో తింటారా అని మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఎద్దేవా చేశారు. ఆప్,కాంగ్రెస్,పలువురు నిర్మలా వ్యాఖ్యలపై వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. సీతారామన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతుండటంతో.. తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారంటూ నిర్మలా సీతారామన్ కార్యాలయం గురువారం ట్వీట్ చేసింది.