logo



ఏపీ రాజధాని అమరావతి శ్మశానం అంటూ : బొత్స వివాదాస్పద వ్యాఖ్యలు

...

మంత్రి బొత్సా రాజధాని అమరావతి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 28న అమరావతిలో పర్యటించాలని నిర్ణయించారు. దీనికి స్పందనగా మంత్రి బొత్సా మాట్లాడుతూ..అమరావతిని శ్మశానంతో పోల్చుతూ మాట్లాడారు. రాజధాని శ్మశానాన్ని చూసి ఏడవడానికి వస్తున్నావా..అంటూ ప్రశ్నించారు.దీనికి కొనసాగింపుగా ఐదేళ్లలో ఏమీ చేయకుండా ఇప్పుడు ఏం చేయడానికి వస్తున్నారన్న అర్థంలోనే తాను ఆ పదం ఉపయోగించానని మంత్రి చెప్పారు. ఇప్పుడు బొత్సా చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ రాజధానిని శ్మశానంతో పోల్చటం ఏంటని నిలదీస్తున్నారు. అసెంబ్లీ..హైకోర్టు..సచివాలయం ఉన్న రాజధాని శ్మశానంతో పోల్చిన మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని టీడీపీ సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు.