logo



భాజపా -శివసేన ..ఎవరికెన్ని సీట్లం టే/

...

దిల్లీ ;మహారాష్ట్రలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మిత్రపక్షాలైన భాజపా -శివసేన మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో సందిగ్ధం నెలకొన్న సంగతి తెలిసిందే .అయితే విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం భాజపా 144 ,శివసేన 126 సీట్లలో పోటీ చేసేలా సంధి కుదిరినట్లు ప్రముఖ జాతీయ మీడియా సంస్ధ వెల్లడించింది .మరో 18 సీట్లు చిన్నపార్టీలకు కేటాయించనున్నట్లు తెలిసింది .అంతేకాకుండా శివసేన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు భాజపా సమ్మతించినట్లు సమాచారం రాష్ట్రంలో ని 288 స్ధానాల్లో సగం సీట్లలో పోటీ చేయాలనే ప్రతిపాదనను తొలుత శివసేన భాజపా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ విడిగా పోటీ చేయాలని ప్రతిపాదించారు .అయితే ముఖ్యమంత్రి దేవేంద్రఫదనవీస్ మాత్రం శివసేనతో కలిసి పోటీ చేసేందుకే మొదటి నుంచి మొగ్గు చూపారు .ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో గురువారం భాజపా -శివసేన నేతలు సమావేశానికి ముఖ్యమంత్రి ఫడనవీస్ సహా కోర్ కమిటీ సభ్యులు పంకజా ముండే తదితరులు హాజరయ్యారు .మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 21 న జరగనున్నాయి .ఆదేనెల 24 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు .