logo



బ్రేకింగ్ ;సినీనటుడు వేణుమాధవ్ కన్నుమూత

...

ప్రముఖ టాలీవుడ్ కామేడియన్ వేణుమాధవ్ కన్నుమూశారు .తీవ్ర అస్వస్ధతకు గురైన ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతు తుదిశ్వాస విడిచారు .గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు .దీంతో ..పాటుగా కిడ్నీ సమస్య కూడా ఉంది .సూర్యాపేట జిల్లా కొడదాలో జన్మించిన వేణుమాధవ్ జన్మించారు .వేణుమాధవ్ భార్య శ్రీవాణి ,ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు .1997 లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ..సంప్రదాయం చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు .నాలుగో ఏట నుంచే ఆయన మిమిక్రీ చేయడం ప్రారంభించారు .లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుగా నంది అవార్డును అందుకున్నారు .సినిమాలతో పాటు పలు టీవీ ప్రోగ్రాములు కూడా చేశారు