logo



అమరావతిలో శ్రీవారి ఆలయానికి రూ .36 కోట్లు

...

తీర్మానించిన తితిదే ధర్మకర్తల మండలి తిరుమల .తితిదే ధర్మకర్తల మండలి సమావేశం ముగిసింది .ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు .అమరావతిలో శ్రీవారి ఆలయ పరిధి తగ్గిస్తూ బోర్డు తీర్మానం చేసింది .రూ .36 కోట్ల తో ఆలయ నిర్మాణం చేయాలని నిర్ణయించారు .గతంలో రూ .150 కోట్లతో రెండు విడతల్లో నిర్మించాలని భావించిన విషయం తెలిసిందే .మరోవైపు తిరుపతి ఆవిలాల చెరువు అభివృద్ధికి రూ .48 కోట్లు కేటాయిస్తూ ..ఇవాళ్టీ బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు .తిరుపతిలో గరుడ వారధి నిర్మాణాన్ని కొనసాగించాలని నిర్ణయించారు .తితిదే ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటుకు తీర్మానించారు .తితిదే ముఖ్య ఆర్ధిక గణాంక అధికారిగా రవిప్రసాద్ ను నియమిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు .