logo



ఇక మా లక్ష్యం గగన్ యాన్ : శివన్

...

భువనేశ్వర్ ;భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ[ఇస్రో ]మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది .చద్రయాన్ -2 ప్రయోగం 98 శాతం విజయం సాధించిందన్న ఇస్రో ఛైర్మన్ శివన్ ..ఇకతమ తదుపరి లక్ష్యం గగన్ యాన్ అని ప్రకటించారు .శనివారం ఆయన ఐ ఐ టీ భువనేశ్వర్ లో ప్రసంగించారు ,ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ..చంద్రయాన్ -2 లోని ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని వివరించారు .ఇక విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం తాము ఎంతో శ్రమించామని కానీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు .చంద్రుడి దక్షిణధృవంపై శుక్రవారం -శనివారం అర్ధరాత్రి మధ్య రాత్రి సమయం ప్రారంభం కావడంతో విక్రమ్ తో మళ్లీ సంబంధాలు ఎర్పరుచుకోవాలన్న ఇస్రో ఆశలు అడియాసలయిన విషయం తెలిసిందే .దీని నుంచి వెంటనే తెరుకున్న ఈస్రో ఇకతమ తదుపరి లక్ష్యం గగన్ యాన్ అని స్పష్టం చేసింది .