logo



ఈ నెల 27 వరకు అమెరికాలో పర్యటించనున్న మోదీ

...

హైదరబాద్ ;భారత ప్రధాని మోదీ ఈ నెల 27 వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నారు .హ్యూస్టన్ ,న్యూయార్క్ నగరాల్లో మోదీ పర్యటన ఉంటుంది .హ్యూస్టన్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు .అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులతో సమావేశం ఉంటుంది .ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ,డెమోక్రటిక్ పార్టీ నేతలతో కలిసి ప్రసంగిస్తారు .ఐ క్యరాజ్యసమితి నిర్వహిస్తున్న వాతావరణ సదస్సు లో మోదీ మాట్లాడుతారు .ఇదే సదస్సులో ఉగ్రవాదం ,ఆరోగ్యం అంశాలపై ప్రసంగిస్తారు .ఈ నెల 24 ఐ క్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనిమో గుటేరస్ ఇచ్చే విందుకు హాజరవుతారు .మహాత్మగధీ 150 జాయంతి ఉత్సవాల నేపధ్యంలో ఐ క్యరాజ్యసమితి బృందంతో కలిసి 150 మొక్కలు నాటనున్నారు .పలువురు పారిశ్రామికవేత్తలు ,ప్రతినిధులతో మోదీ చర్చలు జరపనున్నారు .ఐ క్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో ప్రసంగించునున్నారు .