logo



కాశ్మీర్ ;షేక్ అబ్దుల్లా చేసిన పీఎస్ ఏ చట్టం కింద పారూక్ అబ్దుల్లా నిర్బందం ...ఏమిటి చట్టం /ఎంత కరి నం

...

నేషనల్ కాన్పరెన్స్ అద్యక్షుడు ,పార్లమెంటు సభ్యుడు పారూక్ అబ్దుల్లాను .జమ్మూకశ్మీర్ ప్రజా భద్రత చట్టం [పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ పిఎస్ ఏ ]కింద అరెస్ట్ చేశారు .జమ్మూకాశ్మీర్ రాష్ట్రనికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పారూక్ అబ్దుల్లాను నిర్బందించటానికి ఆయన ఇంటినే తాత్కాలిక జైలుగా పరిగణిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది .ఈ మేరకు 80 ఏళ్ల వయసు దాటిన పారూక్ ను ఆయన మూడంతస్తుల ఇంట్లోనే ఒక గదిలో నిర్బందించారు .నిజానికి .శ్రీనగర్ నుంచి లోక్ సభకు ప్రాతినిద్యం వహిస్తున్న పారుక్ అబ్దూల్లాను ..జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ,ఆర్టికల్ 35 ఏను రద్దు చేసినప్పటి నుంచీ ..అంటే ఆగస్టు 5 వ తేదీ నుంచే గృహానిర్బందంలో ఉంచారు .అయితే ,పారూక్ స్వేచ్ఛగానే ఉన్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత నెలలో లోక్ సభలో పేర్కొనటంతో ఆయన నిర్బందం అంశం వివాదాస్పదంగా మారింది .ఈ నేపద్యంలో పారూక్ అబ్దూల్లాను కోర్టుముందు హాజరుపరాచలంటూ మరుమలార్చి ద్రావిడ మున్నేట్ర కళ గం నాయకుడు వైగో సోమవారం నాడు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు .సోమవారం ఈ పిటిషన్ విచారణకు రావటానికి కొద్ది గంటల ముందు పారూక్ అబ్దూల్లాను జమ్మూకశ్మీర్ ప్రజా భద్రతచట్టం కింద నిర్బందించినట్లు వార్తలు వచ్చాయి .