logo



ఆర్టికల్ 370 రద్దు నేడు సుప్రీం విచారణ

...

సాక్షిన్యూడిల్లీ ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సీనియర్  నేతగులాం నబీ ఆజాద్ దాఖలు చేసిన పిటిషన్ సహ కాశ్మీర్ పరిణామాలపై సుప్రీం కోర్టు సోమవారం విచారించానుంది ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గంగోయ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఆజాద్ పిటిషన్ తో పాటు సిపిఎం ప్రదాన కార్యదర్శ సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్ సహ ఇదే అంశంపై దాఖలైన పలు పిటిషన్ లను విచారణకు చేపట్టనుంది తమ సహచర నేత చట్టసభ సభ్యుడు మహ్మద్ యూసుఫ్ తరిగామి నిర్బందాన్ని సవాల్ చేస్తూ ఏచూరి సర్వోన్నత న్యాయస్దానాన్ని ఆశ్రయించి న సంగతి తెలిసిందే కాగా తాను వ్యక్తిగత హోదాలో ఈ పిటిషన్ దాఖలు చేశానని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు తన కుటుంబ సభ్యులతో పాటు జమ్ము కాశ్మీర్ ప్రజల బాగోగులను తానుతెలుసుకోగోరుతున్నానని ఆయన చేప్పారు తాను మానవతా దృక్పదంతోనే పిటిషన్ దాఖలు చేశానని రాజకీయాలకు ఎలాంటి సంబందం లేదని ఆజాద్ తెలిపారు