logo



తిరుపతి సంధ్యా థియేటర్ లో కేజీఎఫ్ టీం సందడి..!

...

తిరుపతిలో సంధ్య థియేటర్ లో కేజీఎఫ్ టీం నిన్న సందడి చేసింది. ప్రేక్షకులతో కలిసి హీరో యాష్, హీరోయిన్ శ్రీనిధి శెట్టిలు సినిమాను తిలకించారు. ఈ సందర్భంగా హీరో యాష్ మాట్లాడుతూ కేజీఎఫ్ సినిమా భారీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుందని తెలిపారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తనను కొత్తగా చూపించారని, 3 రోజుల్లో రూ. 58 కోట్ల భారీ వాసుళ్ళ దిశగా సినిమా ప్రదర్శించబడుతోందని ఆనందం వ్యక్తం చేశారు.