logo



పదిహేనేళ్ల క్రితం ఇదే రోజు..: దిల్ రాజు

...

పదిహేనేళ్ల క్రితం వచ్చిన `ఆర్య` సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్టర్ సుకుమార్‌, నిర్మాత దిల్ రాజు కెరీర్‌లకు బలమైన పునాది వేసింది. ఆ సినిమా తర్వాత ఈ ముగ్గురూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ సినిమా విడుదలై నేటికి పదిహేనేళ్లు. ఈ సందర్భంగా ఆ సినిమాను గుర్తు చేసుకుంటూ నిర్మాత దిల్ రాజు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.`పదిహేనేళ్ల క్రితం ఇదే రోజు నేను, బన్నీ, సుకుమార్ జీవితకాల ప్రయాణాన్ని ప్రారంభించాం. మా ముగ్గురి విజయానికి `ఆర్య` అద్భుతమైన ఆరంభంగా నిలిచింది. `ఐకాన్‌` ద్వారా బన్నీతో నాలుగోసారి కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. మరికొద్ది గంటల్లో మరో గుర్తుంచుకోదగిన చిత్రం విడుదల కాబోతోంది. `మహర్షి` నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుంచుకోదగిన మరో చిత్రంగా నిలవబోతోంద`ని దిల్ రాజు పోస్ట్ చేశారు.