logo



ఒడిశాకు అక్షయ్‌ కోటి రూపాయల సాయం

...

ఫనీ తుఫాను ప్రభావంతో ఒడిశా తీవ్రంగా నష్టపోయింది. అందుకుగాను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ భారీ విరాళం అందించారు. దాదాపు కోటి రూపాయలను ఆయన ఒడిశా సీయం నవీన్ పట్నాయక్ సహాయనిధికి పంపించారు. గతంలో కేరళ, చెన్నై తుఫాను బీభత్సం సృష్టించినపుడు కూడా అక్షయ్ తనవంతు సాయం చేశారు. భారత్ కె వీర్ వెబ్ సైట్ ద్వారా జవాను కుటుంబాలను కూడా ఆదుకుంటున్నారు.