logo



బహ్రంపూర్ ఆలయంలో ప్రియాంకాగాంధీ పూజలు

...

ఉత్తరప్రదేశ్ (పశ్చిమ) కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ ప్రియంకాగాంధీ వాద్రా యూపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రియాంక తన తల్లి సోనియాగాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలిలో పర్యటించారు. బహ్రాంపూర్ లోని దేవాలయంలో ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ప్రియాంకా వెంట పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఆలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. మరోవైపు ప్రియాంకాగాంధీ పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు.