logo



ఆ క్రికెటర్ అంటే నాకు పిచ్చి: కాజల్‌

...

దశాబ్ద కాలం నుంచి తెలుగులో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్‌. తెలుగులో దాదాపు అగ్రహీరోలందరి సరసనా నటించింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్న `సీత` సినిమాలో నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది.తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన కాజల్ తనకు నచ్చిన క్రికెటర్ గురించి మాట్లాడింది. `మీకు నచ్చిన ఆటగాడు ఎవరు` అనే ప్రశ్నకు కాజల్ సమాధానమిచ్చింది. `నాకు రోహిత్ శర్మ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు ఆయనపై క్రష్ ఉండేది. రోహిత్ ఆటతీరు, ప్రవర్తన నన్ను కట్టిపడేసేవి. అతని బ్యాటింగ్ స్కిల్స్ అద్భుతం` అంటూ కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ సరసన `భారతీయుడు-2`లోనూ, `పారిస్ పారిస్‌` సినిమాలోనూ నటిస్తోంది.