logo



మే 19 వరకు ఆ సినిమాను విడుదల చేయొద్దు ..!

...

వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ ను 19 వరకు విడుదల చేయొద్దని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సూచించింది. ఈ చిత్రం బయోపిక్ కన్నా ముందు మహాత్ముల జీవితచరిత్ర. ఇలాంటి చిత్రం బీజేపీ పార్టీకి ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి చేకూరే అంశమని ఈసీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో చివరి విడత లోక్ సభ ఎన్నికల ముగిసే వరకు పీఎం నరేంద్రమోదీ చిత్రం విడుదల చేయవద్దని కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈసీ పేర్కొంది. పీఎం నరేంద్రమోదీ చిత్రా ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా బిజెపీకి ప్రయోజనం కలిగించే విధంగా ఉందని,ఎన్నికల సమయంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే జనాలపై ప్రభావాన్ని చూపించే అవకాశమున్నందున విడుదల ఆపేయాలని పలు రాజీకియా పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.