logoసీఎం అయ్యేంతవరకూ నా బట్టలు నేనే ఉతుక్కునే వాడిని: నరేంద్ర మోదీ

...

గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించేంత వరకూ తన బట్టలను తానే ఉతుక్కునేవాడినని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఎక్కడికి వెళ్లినా విడిచిన దుస్తులు ఉతికి ఆరేసుకునే అలవాటు ఉండేదని అన్నారు. పాశ్చాత్య ఆహారపు అలవాట్లతో ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డ మోడీ, సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. మూమూలు సమయాల్లో తాను సాయంత్రం 5 గంటలకెల్లా డిన్నర్ ముగించేస్తానని చెప్పారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో ప్రత్యేకంగా ముచ్చటించిన ప్రధాని, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారు పడే కష్టమే వారిని ఆరోగ్యవంతులుగా ఉంచుతుందని చెప్పారు. సోషల్ మీడియా అంటే తనకెంతో ఆసక్తి ఉందని, మారుతున్న కాలానికి, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా, సాంకేతికత అందించే సౌలభ్యాలను అందిపుచ్చుకోవడం తనకు ఇష్టమని మోడీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.