logo



అమిత్‌ షా మనువరాలిని ఎత్తుకొని మోదీ అభివాదం

...

ఓటేసేందుకు అహ్మద్‌నగర్‌ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మనువరాలు కూడా అక్కడే ఉండడంతో ఆ చిన్నారిని ఎత్తుకొని మోదీ ప్రజలకు అభివాదం చేశారు. పోలింగ్‌ బూత్‌ వరకు నడుచుకుంటూ మోదీ వచ్చారు. మోదీని చూసేందుకు భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మోదీ అక్కడున్నంత సేపు మోదీ, మోదీ అంటూ కార్యకర్తలు నినదించారు. దీంతో మోదీ రెండు చేతులు జోడించి వారికి నమస్కారం చేశారు. మోదీ ఓటేసిన అనంతరం మాట్లాడుతూ ఐఈడీ బాంబుల కన్నా ఓటరు ఐడీ అత్యంత శక్తివంతమైనందని వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఉగ్రవాదులకు ఐఈడీ బాంబులే ఆయుధాలు అని, కానీ ప్రజాస్వామ్యానికి ఓటరు ఐడీయే శక్తి అని మోదీ పేర్కొన్నారు. గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.