logoరామోజీరావు ఇంట వివాహ వేడుక

...

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మనవరాలు, దివంగత సుమన్‌, విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన, వినయ్‌ల కల్యాణ వేడుక రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివస్తున్నారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్‌ రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, బ్రహ్మానందం, అచ్చిరెడ్డి తదితరులు హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులు కంభం పాటి రామ్మోహన్‌రావు, గంటా శ్రీనివాసరావు, మండలి బుద్ధ ప్రసాద్‌, జి.వివేక్‌ తదితరులు తరలివచ్చారు.