logoమహేష్ , చెర్రీ ..కలిసి క్రిస్మస్ వేడుక

...

క్రిస్మస్ వేడుకలు నిన్న దేశమంతటా ఘనంగా జరిగాయి. ఈ పండుగని పురస్కరించుకొని క్రైస్తవ సోదర, సోదరిమణులకి ప్రముఖ రాజీకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక నిన్న సాయంత్రం క్రిస్మస్ వేడుకలని దేశంలో పలువురు సినీ ప్రముఖులు ఘనంగా జరుపుకున్నారు. ఈ మధ్య ప్రతి పార్టీలో కలిసి కనిపిస్తున్న మహేష్, రామ్ చరణ్ లు క్రిస్మస్ వేడుకని కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. వేడుకలలో మహేష్ భార్య నమ్రత , రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ ప్రస్తుతం మహర్షి సినిమాతో బిజీగా ఉండగా, తాజాగా హైదరబాద్ షెడ్యూల్ పురైంది. జనవరిలో మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు. ఇక రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతికి విడుదల కానుండగా, ప్రి రిలీజ్ వేడుకని డిసెంబర్ 27న జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ లోను నటిస్తున్నారు రామ్ చరణ్.