logo



సుప్రీంకు చేరిన పీఎం నరేంద్రమోడీ

...

మోడీ బయోపిక్ పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదల అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. సినిమా విడుదలపై ఎలక్షన్ కమిషన్ నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలైంది. మోడీ బయోపిక్ నిర్మాతలు ఈ పిటీషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు దాన్ని విచారణకు స్వీకరించింది. ఈ నెల 15న వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది.ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ బయోపిక్‌ విడుదలను నిలిపివేయాలంటూ విపక్షాలు గతంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది. పీఎం నరేంద్రమోడీ విడుదల నిర్ణయాన్ని ఈసీకి వదిలేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సినిమా విడుదలకు నిరాకరించింది. ఎన్నికలు ముగిసే వరకు మోడీ బయోపిక్ సహా రాజకీయ నాయకుల జీవిత గాధల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు రిలీజ్ చేయొద్దని ఆదేశించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.