logo



బయోపిక్ లో సాయి పల్లవి ..!

...

ఫిదా, ఎంసీఏ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సాయిపల్లవి తాజాగా పడి పడి లేచే మనసు చిత్రం తో ప్రేక్షకుల ముందుకువచ్చింది. హనురాఘవ పూడి డైరెక్షన్లో శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవికి ప్రేక్షకుల నుండి మిక్సెడ్ టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సాయి కి మరో మెగా ఆఫర్ వచ్చినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దివంగత జయలలిత జీవిత ఆధారంగా ఆమె బయోపిక్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా జయలలిత కథను ముగ్గురు దర్శకులు తెరకెక్కిస్తున్నారు. వారిలో ఒకరు ఏ. ఎల్ విజయ్. ఇప్పటికే జయలలిత పాత్రలో విద్యాబాలన్ ఎంపిక చేయగా, ఆమె స్నేహితురాలు శశికళ గా సాయిపల్లవిని ఎంపిక చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు ఎంత వరకు నిజమో కాదో తెలియాల్సి ఉంది.