logo



మజిలీ డైరెక్టర్ ఇంట వెల్లివీరిసిన ఆనందం ..!

...

సమంత, నాగ చైతన్య ప్రధాన పాత్రలలో శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం మజిలీ. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మలుపులు, వేదనలు, ఎత్తుపల్లాలు ఎదురవుతుంటాయి. అలాంటి జ్ఞాపకాలతో కూడిన యువకుడి జీవన మజిలీని ఎంతో అందంగా తెరకెక్కించారు. శివ నిర్వాణ. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఒకవైపు మజిలీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న శివ నిర్వాణకి సంతోషాన్ని ఇచ్చే విషయం మరొకటి ఎదురైంది. ఆయనకి పండంటి మగ బిడ్డకి తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని శివ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.   ఈ సందర్భంగా ఆయనకి పలువురు ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు . శివ నిన్నుకోరి అనే చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించాడు.