logoపశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జగన్‌ ప్రచారం

...

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు మేలు జరగలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆయన ఏలూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని విమర్శించారు. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోందని జగన్‌ అన్నారు.