logo



ఆ వార్త నిజం కాదు ..!

...

హైదరబాద్ లోని ఎర్రమంజిల్ కోర్టు తనకు ఏడాది జైలు శిక్ష విధించినట్లు వచ్చిన వార్తలను ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మోహన్ బాబు కొట్టిపారేశారు. ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా ఆయన స్పష్టత ఇచ్చారు. చెక్ బౌన్స్ కేసులో నాకు శిక్ష పడినట్లు పలు టీవి చానళ్లలో తప్పుడు వార్తలు విని నిరాశకు లోనయ్యా. ఆ వార్తలు నిజం కాదు. నేను హైదరాబాద్‌లోని మా ఇంట్లో ఉన్నా అని ట్వీట్ చేశారు.