logo



కాంగ్రెస్‌ పార్టీ తరపున కృష్ణ పూనియా పోటీ

...

కాంగ్రెస్‌ పార్టీ తరపున డిస్కస్‌ త్రో క్రీడాకారిణి కృష్ణ పూనియా లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేస్తున్నారు. ఒలింపియన్ కృష్ణ పూనియా జైపూర్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారని కాంగ్రెస్‌ అధిష్టానం నిన్న ప్రకటించింది. ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున కేంద్ర మంత్రి రాజవర్ధన్‌ రాథోడ్‌ పోటీ చేస్తున్నారు. కృష్ణ పూనియా సొంత నియోజకవర్గం రాజస్థాన్‌లోని సదూల్‌పూర్‌. ఈమె 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌లో డిస్కస్‌ త్రోలో బంగారు పతకం సాధించారు.