logo



నేటి నుంచి అలీ ప్రచారం టీడీపీ వలస నేతలతో మొదలు ..!

...

ప్రముఖ సినీ నటుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అలీ నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచీ వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనకు మద్దతుగానే అలీ ఎన్నికల ప్రచారం నిర్వజించనున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో మంత్రి గంటా శ్రీనివాస్ విజయం సాధించగా, ఈ సారి టికెట్ మాత్రం సబ్బం హరికి కేటాయించింది ఆ పార్టీ అధిష్ఠానం.